సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Markets End With Slight Losses | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Oct 12 2023 4:07 PM | Updated on Oct 12 2023 4:24 PM

Stock Markets End With Slight Losses - Sakshi

Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. నష్టాల్లో జారుకున్నాయి.  మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64.66 పాయింట్ల నష్టంతో 66408 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.35 పాయింట్ల నష్టంతో 19794.80 పాయింట్లకు చేరింది. 

బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, మారుతి సుజుకీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, గ్రాసిమ్‌, బజాజ్‌ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌డీఎఫ​్‌సీ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం కంపెనీలు లాభాల్లో ట్రేడయ్యాయి. నష్టాల జాబితాలో  టెక్‌ మహింద్రా, అపోలో హాస్పటల్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌టీ మైండ్‌ట్రీ, సిప్లా, యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో కంపెనీలు ఉన్నాయి.

రూపాయి: నేడు రూపాయి డాలర్‌తో పోలిస్తే స్వల్ప నష్టంలో 83.24 వద్ద ముగిసింది. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
 

Advertisement
 
Advertisement
Advertisement