స్టాక్‌ మార్కెట్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌.. | stock market updates on may 27 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్టాక్‌ మార్కెట్‌లో ప్రాఫిట్‌ బుకింగ్‌..

May 27 2025 9:56 AM | Updated on May 27 2025 9:56 AM

stock market updates on may 27 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల వరుస లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లో ఈరోజు ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఉదయం 09:47 సమయానికి నిఫ్టీ(Nifty) 220 పాయింట్లు తగ్గి 24,783కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 743 ప్లాయింట్లు పడిపోయి 81,431 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.89 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63.95 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.67 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 1 శాతం పడిపోయింది.

ముందుగానే ‘నైరుతి’ పలకరింపు, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలపై ట్రంప్‌ 50% సుంకాల విధింపు వాయిదాతో దలాల్‌ స్ట్రీట్‌ సోమవారం అరశాతానికిపైగా లాభపడింది. కేంద్రానికి ఆర్‌బీఐ 2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ ప్రకటన, జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం అంశాలు వంటి కలిసొచ్చాయి. అమెరికా కరెన్సీ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోని సానుకూలతలు కలిసిరావడంతో నిన్నటి మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలపడి 85.10 వద్ద స్థిరపడింది.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement