స్థిరంగా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | stock market updates on febraury 14 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్థిరంగా కదలాడుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Feb 14 2025 9:38 AM | Updated on Feb 14 2025 10:58 AM

stock market updates on febraury 14 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు పెరిగి 23,034కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 54 పాయింట్లు ఎగబాకి 76,174 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75.17 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.04 శాతం పుంజుకుంది. నాస్‌డాక్‌ 1.5 శాతం పెరిగింది.

ఇదీ చదవండి: వాహన జోరుకు యూవీల తోడు

నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ నేపథ్యంలో తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ట్రేడింగ్‌లో అధిక సమయం లాభాల్లో కదలాడాయి. ఫార్మా, మెటల్, ఫైనాన్స్, విద్యుత్, టెలికం షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా జనవరి ద్రవ్యోల్బణం అంచనాలకు మించడంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement