కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Stock Market updates On december 14 | Sakshi
Sakshi News home page

కీలక వడ్డీరేట్లపై త్వరలో నిర్ణయం.. ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Dec 4 2024 4:15 PM | Updated on Dec 4 2024 4:38 PM

Stock Market updates On december 14

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 24,467 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 110 పాయింట్లు ఎగబాకి 80,956 వద్దకు చేరింది.

ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) క్రమంగా అమ్మకాలను తగ్గిస్తున్నారు. అయితే ఈ నెల 6న జరగబోయే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంపై మార్కెట్‌ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్‌ మహీంద్రా బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఆదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement