భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ | Stock Market Today Updates On June 15th 2026, Sensex Soars 1,000 Points And Nifty Nears 24,000 | Sakshi
Sakshi News home page

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. వెయ్యి పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

Jun 15 2026 9:43 AM | Updated on Jun 15 2026 11:30 AM

Stock Market Sensex surges 1000 pts June 15

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా,  ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బెంచ్‌ మార్క్‌ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ అమాంతం ఎగిశాయి. ఉదయం 9:41 గంటల సమయానికి నిఫ్టీ 326.10 పాయింట్లు లేదా 1.38 శాతం పెరిగి 23,949.00 వద్ద, సెన్సెక్స్ 1,063.64 పాయింట్లు లేదా 1.41 శాతం పెరిగి 76,591.59 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

పశ్చిమాసియాలో నాలుగు నెలల పాటు జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి వాషింగ్టన్, టెహ్రాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా, ఇరాన్ రెండూ అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ లో బ్రెంట్ క్రూడ్ జూన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ 3.5 శాతం తగ్గి బ్యారెల్ కు 83.79 డాలర్లుగా ఉంది. యూఎస్, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కీలకమైన ఇంధన సరఫరా జలమార్గం హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నందున పెట్టుబడిదారుల ఆందోళలు సడలాయి. 

నిఫ్టీ 50 ఇండెక్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.4 శాతం, 1.7 శాతం పెరిగాయి.

సెక్టార్ వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement