గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@25,278 | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@25,278

Sep 2 2024 3:37 PM | Updated on Sep 2 2024 3:43 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 25,278 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 194 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, ఇండస​్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్‌టెల్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement