ఐటీ షేర్ల మెరుపులు.. ఫ్లాట్‌గా మార్కెట్లు | Stock Market Rally On Today closing | Sakshi
Sakshi News home page

ఐటీ షేర్ల మెరుపులు.. ఫ్లాట్‌గా మార్కెట్లు

Aug 14 2024 3:53 PM | Updated on Aug 14 2024 3:58 PM

Stock Market Rally On Today closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన బెంచ్‌ మార్క్‌ సూచీలు.. ఐటీ, టెక్నాలజీ షేర్లపై మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో లాభాల్లో స్థిరపడ్డాయి.

సెషన్‌ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 149.85 పాయింట్లు లేదా 0.19% లాభపడి 79,105.88 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4.20 పాయింట్లు లేదా 0.017% పెరిగి 24,143.20 వద్ద సెషన్‌ను ముగించింది.

నిఫ్టీ లిస్టింగ్‌లో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, బీపీసీల్‌ టాప్‌ గెయినర్స్‌గా మెరిశాయి. దివిస్‌ ల్యాబ్స్‌, హీరో మోటర్‌ కార్ప్‌, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఓన్‌ఎన్‌జీసీ షేర్లు టాప్‌ లూజర్స్‌గా భారీ నష్టాలను చవిచూశాయి.

గమనిక: రేపు భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌ సెలవు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement