సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

Jan 30 2024 3:41 PM | Updated on Jan 31 2024 10:48 AM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్‌ ముగించాయి. నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 21,527కు చేరింది. సెన్సెక్స్‌ 786 పాయింట్లు తగ్గి 71,183 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ముగించాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో 0.15 శాతం పెరిగి 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ)’ సోమవారం రూ.110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ)’ సైతం రూ.3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement