25,000 మార్కు దాటిన నిఫ్టీ.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు | Stock Market opening Rally On October 14 2024 | Sakshi
Sakshi News home page

25,000 మార్కు దాటిన నిఫ్టీ.. లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Oct 14 2024 9:39 AM | Updated on Oct 14 2024 9:39 AM

Stock Market opening Rally On October 14 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 25,052కు చేరింది. సెన్సెక్స్‌ 291 పాయింట్లు పుంజుకుని 81,656 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 102.89 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 79.03 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.61 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.33 శాతం పుంజుకుంది.

ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..

ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా గత వారం ముడిచమురు ధరలు రివ్వున పైకెగశాయి. మరోపక్క డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్టం 84ను దాటి ముగిసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ అంశాలన్నీ విదేశీ మారక నిల్వలపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలవని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చైనా సహాయక ప్యాకేజీలు, అందుబాటులో ఉన్న షేర్ల విలువలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement