ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు.. ఊపు మీదున్న ఐటీ షేర్లు | Stock Market opening Rally On 27 sptember 2024 | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు.. ఊపు మీదున్న ఐటీ షేర్లు

Sep 27 2024 9:26 AM | Updated on Sep 27 2024 9:28 AM

Stock Market opening Rally On 27 sptember 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:15 సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 78.99 పాయింట్లు లేదా 0.092% లాభపడి 85,915.11 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ 9.40 పాయింట్లు లేదా 0.036% పెరిగి 26,225.45కు చేరింది.

నిఫ్టీ లిస్టింగ్‌లో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, లార్సెన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఓన్‌ఎన్‌జీసీ, టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ వంటివి ప్రతికూలంగా ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement