
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద నిలిచాయి.
సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఓరియంట్ బెల్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, పాలీ మెడిక్యూర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సెంచరీ ఎంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కేసాల్వ్స్ ఇండియా, ప్రైమ్ ఫోకస్, ఓరియంటల్ హోటల్స్ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).