స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ చేతికి జీస్కేల్‌ ఎనర్జీ! | Standard Engineering to acquire 51percent stake in GScale energy | Sakshi
Sakshi News home page

స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ చేతికి జీస్కేల్‌ ఎనర్జీ!

Jun 26 2026 5:17 AM | Updated on Jun 26 2026 5:17 AM

Standard Engineering to acquire 51percent stake in GScale energy

51% మెజారిటీ వాటా కొనుగోలు

తొలి దశ పెట్టుబడి 190 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏఐ డేటా సెంటర్‌ ఇంజనీరింగ్‌ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ జీస్కేల్‌ ఎనర్జీలో స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ (ఎస్‌ఈటీఎల్‌) 51 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా పెట్టుబడులు, షేర్ల మారి్పడి రూపంలో ఈ డీల్‌ ఉంటుంది. ఇందుకు సంబంధించి తొలి దశలో రూ. 190 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. 

ఈక్విటీ కొనుగోలు, ఉమ్మడి వ్యాపార విస్తరణ, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం మొత్తం మీద సుమారు రూ. 500 కోట్లు పెట్టుబడులకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల ఈ విషయాలు తెలిపారు. ఫార్మా, కెమికల్‌ తదితర రంగాలకు ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ని అందించడం నుంచి ఏఐ డేటాసెంటర్‌ రంగంలోకి ప్రవేశించడం వరకు తమ కంపెనీ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. 

2026 నవంబర్‌ నుంచి కొత్త వ్యాపార విభాగం తయారీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఖరు నాలుగు నెలల్లో ఆ ఆర్థిక ఫలితాలు కంపెనీకి జతవుతాయని పేర్కొన్నారు. ఈ వ్యవధిలో కొత్త విభాగం నుంచి రూ. 250 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఈటీఎల్‌ తయారీ, ఆర్థిక, ఇంజనీరింగ్‌ సామర్థ్యాలతో ప్రపంచ స్థాయి ఏఐ డేటాసెంటర్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ అందిస్తామని జీస్కేల్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు కాసు బ్రహా్మరెడ్డి చెప్పారు.  గురువారం ఎస్‌ఈటీఎల్‌ షేరు 5% క్షీణించి రూ. 213 వద్ద క్లోజైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement