వెండి హాల్‌మార్కింగ్‌ సవాళ్లపై అధ్యయనం | Silver Hallmarking BIS Studies Challenges Before Making It Mandatory | Sakshi
Sakshi News home page

వెండి హాల్‌మార్కింగ్‌ సవాళ్లపై అధ్యయనం

Jun 7 2026 8:10 AM | Updated on Jun 7 2026 11:33 AM

Silver Hallmarking BIS Studies Challenges Before Making It Mandatory

న్యూఢిల్లీ: వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ నిబంధనలను తప్పనిసరి చేసేందుకు మౌలిక సదుపాయాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను అధ్యయనం చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌ గర్గ్‌ తెలిపారు. జ్యుయలరీ, కళాకృతులు, ఫర్నిచర్‌ తదితర రూపాల్లో కూడా వెండిని చాలా స్టోర్స్‌లో విక్రయిస్తారు కాబట్టి మార్కెట్‌పరంగా చూసినప్పుడు పసిడితో పోలిస్తే సిల్వర్‌ హాల్‌మార్కింగ్‌ చాలా సంక్లిష్టంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.

బీఐఎస్‌లో మొత్తం హాల్‌మార్కింగ్‌ కార్యకలాపాలను కేవలం అయిదుగురు మాత్రమే పర్యవేక్షిస్తుంటారని, మిగతా సిబ్బంది అంతా ప్రైవేట్‌ లేదా ఔట్‌సోర్సింగ్‌ వారే అయి ఉంటారని గర్గ్‌ చెప్పారు. ప్రైవేట్‌ వర్గాల సహాయంతో హాల్‌మార్కింగ్‌ సెంటర్లను నిర్వహించడం, నమ్మకాన్ని చూరగొనడం అనేది చాలా కష్టతరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి సిల్వర్‌ హాల్‌మార్కింగ్‌ని క్రమంగా అమల్లోకి తేనున్నట్లు గర్గ్‌ చెప్పారు.

2005 నుంచి వెండికి హాల్‌మార్కింగ్‌ స్వచ్ఛందంగా అమలవుతోంది. 2025 సెప్టెంబర్‌ నుంచి సిల్వర్‌ ఆర్టికల్స్‌ స్వచ్ఛతకు సంబంధించి హాల్‌మార్క్‌ విశిష్ట గుర్తింపు (యూహెచ్‌ఐడీ) సంఖ్యను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం వెండి ఆభరణాలను పరీక్షించేందుకు బీఐఎస్‌ గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్‌మార్కింగ్‌ సెంటర్లు (ఏహెచ్‌సీ) సుమారు 230 ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement