ఐపీవో బాటలో మరిన్ని కంపెనీలు | SEBI Approves IPOs Satya Agencies, Kanohar Electricals And Torrent Gas Public Issues, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఐపీవో బాటలో మరిన్ని కంపెనీలు

Jun 26 2026 11:48 AM | Updated on Jun 26 2026 12:05 PM

SEBI Approves IPOs Satya Agencies Kanohar Electricals Torrent Gas Public Issues

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూల (ఐపీవో) ద్వారా నిధులు సమీకరించేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ రిటైల్‌ సంస్థ సత్య ఏజెన్సీస్, ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సంస్థ కనోహర్‌ ఎలక్ట్రికల్స్, టోరెంట్‌ గ్యాస్‌ ప్రతిపాదనలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. సత్యా ఏజెన్సీస్, టోరెంట్‌ గ్యాస్‌ మార్చి నెలలో, కనోహర్‌ ఎలక్ట్రికల్స్‌ జనవరిలో తమ ఐపీవో ముసాయిదా పత్రాలను సమరి్పంచాయి. వాటిని పరిశీలించిన మీదట జూన్‌ 2–25 మధ్య సెబీ తన ’అబ్జర్వేషన్స్‌’ని ఇచ్చింది. దీన్ని పబ్లిక్‌ ఇష్యూకి గ్రీన్‌ సిగ్నల్‌గా పరిగణిస్తారు. కీలకమైన వ్యాపార వివరాలు ప్రస్తుత దశలో బహిర్గతం కాకుండా, టోరెంట్‌ గ్యాస్‌ సంస్థ కాన్ఫిడెన్షియల్‌ విధానంలో తమ పత్రాలను సమర్పించింది.  

సత్య ఏజెన్సీస్‌ రూ. 600 కోట్లు.. 
ముసాయిదా పత్రాల ప్రకారం తమిళనాడుకు చెందిన సత్య ఏజెన్సీస్‌ రూ. 600 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద విక్రయించనున్నారు. ప్రమోటర్లయిన జాన్సన్‌ అసారియా, జె జాన్‌ సత్య, చార్లెస్‌ పకియారాజ్‌ తలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ నిర్దిష్ట రుణాలను చెల్లించివేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించుకోనుంది.  

రూ. 300 కోట్ల కనోహర్‌ ఇష్యూ.. 
కనోహర్‌ ఎలక్ట్రికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేసే యోచనలో ఉంది. అలాగే ప్రమోటర్లు సుమారు 1.45 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సేకరించిన నిధులను వ్యాపార వృద్ధి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. తమ గంగోల్‌ ప్లాంటు కోసం యంత్రపరికరాల కొనుగోలు, ఆటోమేషన్, సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు మొదలైన వాటిపై వెచ్చించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement