న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కొత్త చైర్మన్, ఎండీగా (సీఎండీ) సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీపీసీఎల్‌లోనే రిఫైనరీస్‌కు ఆయన డైరెక్టర్‌గా పనిచేశారు. సీఎండీగా జి.కృష్ణకుమార్ పదవీ కాలం 2025 ఏప్రిల్30తో ముగిసింది.
అప్పటి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను సైతం ఖన్నాయే చూశారు. పెట్రోలియం శాఖ నుంచి నియామకం సమాచారం రావడంతో సీఎండీ బాధ్యతలను ఖన్నా స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు బీపీసీఎల్ సమాచారం ఇచ్చింది. ఆయన నియామకం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.
2029 మే 31 వరకు (పదవీ విరమణ) లేదంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతలు చూస్తారని తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో ఖన్నా కెమికల్ ఇంజనీర్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేశారు.


