
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) 2022–23 సంవత్సరానికి గాను ఇనిస్టిట్యూషనల్ ఎక్సలెన్స్ విభాగంలో ప్రతిష్టాత్మక స్కోప్ ఎమినెన్స్ అవార్డును దక్కించుకుంది.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంస్థ సీఎండీ అనేష్ కుమార్ శర్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలు నిర్వర్తించడం తదితర అంశాల్లో విశేషమైన పనితీరు కనపర్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.