సామాన్యులకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చౌకగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత మార్కెట్లో సరికొత్త ‘ఏస్ 3 హీరా’ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. కేవలం రూ.949 ధరకే లభించే ఈ డివైజ్ ఫీచర్ ఫోన్ విభాగంలో డిజిటల్ సౌలభ్యానికి అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.
యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
ఈ కొత్త ఫోన్ విడుదలతో భారతదేశంలో తన పూర్తి ఫీచర్ ఫోన్ పోర్ట్‌ఫోలియోను యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్‌కు మార్చినట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లకు వేర్వేరు చార్జర్లు వాడే ఇబ్బందిని తప్పించి ఒకే కేబుల్‌తో ప్రతి ఒక్కరూ చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని కంపెనీ సీఈఓ అరిజీత్ తలపాత్రా పేర్కొన్నారు.
కీలక ఫీచర్లు..
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 1,000mAh బ్యాటరీతో పాటు ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్, సూపర్ బ్యాటరీ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. రికార్డింగ్ ఆప్షన్‌తో కూడిన వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్ సదుపాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ భాషలకు మద్దతు ఇచ్చే ‘కింగ్ టాకర్’(టెక్స్ట్-టు-స్పీచ్) ఏఐ అసిస్టెంట్‌ను అందించారు.
ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..


