Sakshi Money Mantra: Business Consultant Karunya Rao About Today Stock Market Analysis - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా : దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ పరుగో పరుగు.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

Aug 4 2023 9:32 AM | Updated on Aug 4 2023 10:04 AM

Sakshi Money Mantra: Business consultant Karunya Rao about today stock market analysis

ఈ వారం ప్రారంభం నుంచి అంతర్జాతీయ ప్రతికూల అంశాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో వరుసగా మూడు రోజో సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే ఈ వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. శుక్రవారం దేశీయ స్టాక్‌ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 329 భారీ లాభాలతో 65570 వద్ద నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 19492 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. 

సిప్లా,హిందాల్కో, టెక్‌ మహీంద్రా, విప్రో, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎథేర్‌ మోటార్స్‌, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఆటో, పవర్  గ్రిడ్‌ కార్పొరేషన్‌,బీపీసీఎల్‌, హీరో మోటో కార్ప్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి
 

Advertisement
 
Advertisement
Advertisement