రూపాయిపై ‘డాలర్‌’ ఒత్తిడి | Rupee falls 60 paise to close at 95. 16 against US dollar | Sakshi
Sakshi News home page

రూపాయిపై ‘డాలర్‌’ ఒత్తిడి

Jul 2 2026 4:16 AM | Updated on Jul 2 2026 4:16 AM

Rupee falls 60 paise to close at 95. 16 against US dollar

60 పైసలు క్షీణించి 95.16 స్థాయికి పతనం 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ‘డాలర్‌ ఇండెక్స్‌’ బలోపేతం కావడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఫలితంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.16 వద్ద ముగిసింది.

డాలర్‌ పుంజుకోవడంతో పాటు ఇతర ఆసియా కరెన్సీల బలహీనత, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనం (పెట్టుబడులు) నిరంతరాయంగా తరలిపోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో 94.67 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన రూపాయి... ఇంట్రాడేలో 94.60 – 95.29 శ్రేణిలో కదలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement