Jio financial services: ఇకపై రిలయన్స్‌ జియో డెబిట్‌ కార్డులు!

Reliance Jio Finance Plan For Issue Debit Cards - Sakshi

ఆటో, హోమ్‌లోన్‌ల జారీకీ యత్నం

ముంబయిలో ఇప్పటికే సేవలు ప్రారంభం

రిలయన్స్‌ జియో టారిఫ్‌ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్‌ విభాగం సేవింగ్స్‌ అకౌంట్లను, బిల్‌ పేమెంట్‌ సర్వీసులను సంస్థ రీలాంచ్‌ చేసింది. త్వరలో డెబిట్‌ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్‌లోన్‌లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి  వ్యక్తిగత రుణాలు అందిస్తుంది.

త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్‌ను సైతం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సిద్ధం చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top