పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్‌స్కైబర్లు | Reliance Jio Adding 41.78 Lakh Mobile Subscribers In January | Sakshi
Sakshi News home page

పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్‌స్కైబర్లు

Apr 2 2024 7:06 PM | Updated on Apr 2 2024 7:16 PM

Reliance Jio Adding 41.78 Lakh Mobile Subscribers In January - Sakshi

ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సబ్‌స్కైబర్లతో దూసుకుపోతుంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు. 

జనవరిలో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌కు 1.18 లక్షల మంది చేరారు. వోడాఐడియా 44,649 మంది, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి. 

జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియోలో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్‌టెల్‌లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్‌ఎన్‌ఎల్‌లు తమ కస్టమర్లను కోల్పోయాయి. ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement