
మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.
ఉదాహరణకు ప్యాసింజర్ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.
కొన్ని గణాంకాలు
2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,169.
2024–25లో ఈ ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,940.
2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86
దేశంలో 2025 ఆగస్ట్ 7 నాటికి నడుస్తున్న వందేభారత్ రైళ్లు 144
2023–24లో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లు
రైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు