breaking news
rail tickets
-
రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ
మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.ఉదాహరణకు ప్యాసింజర్ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.కొన్ని గణాంకాలు2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,169.2024–25లో ఈ ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,940.2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86దేశంలో 2025 ఆగస్ట్ 7 నాటికి నడుస్తున్న వందేభారత్ రైళ్లు 1442023–24లో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లురైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు -
మొబైల్ వ్యాన్‌లో రైలు టిక్కెట్ల విక్రయం
సీతానగరం (తాడేపల్లి రూరల్): పుష్కరాల సందర్భంగా కృష్ణా తీరానికి విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా రైల్వేశాఖ మొబైల్ వాహనంలో టికెట్ల విక్రయాలు చేపట్టింది. సీతానగరం పుష్కరఘాట్ సమీపంలోని ఉండవల్లి నాలుగురోడ్ల కూడలి సెంటర్లో వ్యాన్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు రైల్వే టిక్కెట్లు అమ్ముతున్నారు. ఈ వ్యాన్ వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు సమీపంలోని కృష్ణా కెనాల్, విజయవాడ జంక్షన్, మంగళగిరి రైల్వేస్టేషన్ల ద్వారా ప్రయాణాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. రైల్వేస్టేషన్‌కు వెళ్లి క్యూలో నిలబడి టిక్కెట్లు తీసుకునే అవసరం లేకుండా సౌకర్యవంతంగా ఉందని పలువురు తెలిపారు. -
త్వరలో చీప్‌గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు!
న్యూఢిల్లీ: మున్ముందు ఇంధన (పెట్రోల్, డీజిల్)ధరలు, రైలు టెక్కెట్లు, టెలిఫోన్ బిల్లులు మరింత చౌకగా ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేయనున్నారు. అది కూడా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించేవారికే ఈ సౌకర్యం లభించనున్నట్లు తెలిసింది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను నియంత్రించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామని అందులో భాగంగా ఎలక్ట్రానిక్ కార్డుల వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు గతంలో అరుణ్ జైట్లీ చెప్పిన విషయం తెలిసిందే. ఆదాయపన్నును క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించేవారికి కొన్ని ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు, ఇలా చేయడం ద్వారా బదిలీ చెల్లింపులనుంచి కూడా మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం. లక్ష రూపాలయకంటే పెద్ద మొత్తాన్ని కూడా ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, అయితే, రెండు లక్షలకు పైగా చెల్లింపులు చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా పాన్ కార్డు అవసరం ఉంటుందని మంగళవారం జైట్లీ చెప్పారు కూడా. దీనిపై పూర్తి స్థాయిలో లోక్ సభలో అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.