పోర్షే కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే? | Porsche 911 GT3 Launched In India At Rs 3 32 Crore | Sakshi
Sakshi News home page

పోర్షే కొత్త కారు లాంచ్: ధర ఎంతంటే?

Jun 18 2026 3:01 PM | Updated on Jun 18 2026 3:09 PM

Porsche 911 GT3 Launched In India At Rs 3 32 Crore

పోర్షే భారతదేశంలో కొత్త తరం 911 GT3ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.32 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పోర్షే 911 జీటీ3 కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 503 బీహెచ్‌పీ పవర్, 470 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ కారు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కానీ ఇండియన్ మార్కెట్లో స్టాండర్డ్‌గా పీడీకే గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు.

10 రంగులలో లభించే ఈ కారు 21 ఇంచెస్ అల్యూమినియం వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ సిల్వర్ థీమ్ పొందుతుంది. ప్రత్యేకమైన సీట్లు, రూఫ్ ఫినిష్, సీట్ బెల్ట్‌లు, వీల్స్ నుంచి కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్‌లు మొదలైనవి ఉన్నాయి. పనితీరు అద్భుతంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement