న్యూఢిల్లీ: దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల ఇమిగ్రేషన్ క్లియరెన్స్‌కి ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్‌ల అవసరం ఉండదు. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌ల్లోని ఈ–బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై ఫిజికల్ స్టాంపింగ్ ప్రక్రియను తొలగించడం ఇందుకు కారణం. సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఇమిగ్రేషన్ బ్యూరో (బీవోఐ) వెల్లడించింది.
హోమ్ శాఖలో భాగమైన బీవోఐ సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేసింది. ఎఫ్‌టీఐ–టీటీపీ (ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్–ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం) కింద నమోదు చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ–గేట్స్ వద్ద ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. పేపర్‌రహితమైన, సాఫీ ప్రయాణానికి ఈ విధానం దోహదపడగలదని బీవోఐ వివరించింది.
⚠️ IMPORTANT ADVISORY!
Starting 1st September 2026, go digital!
👉🏽 e-BOARDING PASSES NOW ACCEPTED
🔸 International travellers can use e-boarding passes displayed on their smartphones during immigration clearance.
🔸 FTI-TTP enrolled travellers can also use them at e-Gates.… pic.twitter.com/9os2Eg0nP2— Bureau of Immigration, Government of India (@BOIndiaOfficial) August 24, 2026


