అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్స్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వల్ల డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 1,64,400కి చేరింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి.
చివరిసారిగా మార్చి 9న పుత్తడి రేటు రూ. 1,64,300 పలికింది. అటు వెండికూడా వరుసగా మూడో సెషన్లోనూ పెరిగింది. కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 2,53,500కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 42.45 డాలర్లు (1 శాతం) పెరిగి 4,646.54 డాలర్లు పలికినట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కైనాత్ చైన్‌వాలా తెలిపారు.
వెండి ధర ఫ్లాట్‌గా 69 డాలర్ల వద్ద ట్రేడయినట్లు పేర్కొన్నారు. బంగారం కీలకమైన 4,650 డాలర్ల చేరువకు వచ్చిన నేపథ్యంలో తదుపరి కదలికలు భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కన్నా ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.
ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్‌కాయిన్.. కారణాలివే!


