పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్ | No Fee To Be Charged for Updation of Nominees for PPF Accounts Say Nirmala Sitaraman | Sakshi
Sakshi News home page

పీపీఎఫ్ నామినీ మార్పునకు ఛార్జీలు లేవు: నిర్మలా సీతారామన్

Apr 3 2025 3:38 PM | Updated on Apr 3 2025 4:20 PM

No Fee To Be Charged for Updation of Nominees for PPF Accounts Say Nirmala Sitaraman

నామినీ వివరాలను అప్డేట్ చేసినప్పుడు లేదా మార్చినప్పుడు 'పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్' (PPF) చందాదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

పీపీఎఫ్ ఖాతాలకు నామినీ పేర్లను మార్చడానికి ఆర్ధిక సంస్థలు రూ.50 వసూలు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చార్జీలను తొలగించడానికే జీవో తీసుకురావడం జరిగింది. దీనికోసం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇటీవల ఆమోదం పొందిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 ప్రకారం.. డిపాజిటర్ల డబ్బు, సురక్షిత కస్టడీలో ఉంచిన వస్తువులు, భద్రతా లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వరకు నామినీలు ఉండవచ్చు.

ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన గోల్డ్ రేటు: ఇదే ఆల్‌టైమ్‌ రికార్డ్!

నామినేషన్ కోసం ఫారం-10 ని దాఖలు చేయడం ద్వారా మీరు మీ పీపీఎఫ్ ఖాతాలోని నామినీ వివరాలను మార్చవచ్చు. దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అప్డేట్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి కొన్ని బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చందాదారులు వివరాలను నవీకరించడానికి అనుమతిస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement