హైదరాబాద్‌లో ముత్తూట్‌ గోల్డ్‌ పాయింట్‌

Muthoot Opened Its Gold Point In Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పుత్తడి వ్యాపారంలో ఉన్న ముత్తూట్‌ ఎగ్జిమ్‌ తెలంగాణలో తొలి గోల్డ్‌ పాయింట్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సంస్థ ఖాతాలో దేశవ్యాప్తంగా ఇటువంటి కేంద్రాల సంఖ్య 14కు చేరుకుంది. ఈ సెంటర్స్‌ ద్వారా వినియోగదార్ల నుంచి పాత బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రీసైకిల్‌ ద్వారా శుద్ధిచేసిన బంగా రాన్ని దేశీయంగా సంస్థ విక్రయిస్తుంది.  

విజయవాడ తర్వాత
ముత్తూట్‌ సంస్థ 2015లో తొలి గోల్డ్‌ పాయింట్‌ సెంటర్‌ని తమిళనాడులోని కోయంబత్తూర్‌లో నెలకొల్పింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, మధురై, విజయవాడ, ఎర్నాకుళం, తిరుచ్చి, పూణేలలో ఈ సెంటర్లు ప్రారంభించింది. తెలుగు స్టేట్స్‌లో విజయవాడ తర్వాత రెండో సెంటర్‌ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ గోల్డ్‌ సెంటర్లలో బంగారం నాణ్యత పరీక్షలు, విలువ మదింపులు ఎంతో పారదర్శకంగా జరుగుతాయని ముత్తూట్‌ అంటోంది. 
 

చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top