తెలుగు రాష్ట్రాలపై ఎంటీఆర్‌ మరింత ఫోకస్‌ | MTR more focus on Telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలపై ఎంటీఆర్‌ మరింత ఫోకస్‌

Mar 1 2024 4:47 AM | Updated on Mar 1 2024 4:47 AM

MTR more focus on Telugu states - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆహారోత్పత్తుల సంస్థ ఎంటీఆర్‌ రెండు తెలుగు రాష్ట్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో సునయ్‌ భాసిన్‌ తెలిపారు. ఓక్లా ఇండియాలో భాగమైన తమ సంస్థ గత మూడేళ్ల వ్యవధిలో గుంటూరులోని ప్లాంటు, ఇతరత్రా అప్‌గ్రేడేషన్‌ మొదలైన వాటిపై రూ. 100 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో లైన్‌పై రూ. 30 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో వివరించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1.5 లక్షల అవుట్‌లెట్స్‌ ఉన్నాయని, గత అయిదేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపయ్యాయని భాసిన్‌ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమ సంస్థకు రెండో అతి పెద్ద మార్కెట్‌ అని తెలిపారు. సంస్థ ఏర్పాటు చేసి వందేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామన్నారు. మూడు విభాగాలతో కలిపి ఓక్లా ఇండియా టర్నోవరు రూ. 2,300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement