ఎల్‌జీబీటీక్యూ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు | Sakshi
Sakshi News home page

ఎల్‌జీబీటీక్యూ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు

Published Sat, Jul 1 2023 7:30 AM

More facilities for LGBTQ staff - Sakshi

ముంబై: పని ప్రదేశాల్లో లింగ సమానత్వం పాటించే దిశగా ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే తదితరులు) ఉద్యోగులకు బాసటనివ్వడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా తమ సిబ్బంది, వారి భాగస్వాములకు ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చినట్లు 24/7డాట్‌ఏఐ సంస్థ వెల్లడించింది. అలాగే, పేటర్నిటీ, మెటర్నిటీ లీవుల సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. 

సంస్థ అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీకి మిగతా ఉద్యోగుల తరహాలోనే వారు తమ సమస్యలను తెలియజేసి, అవసరమైన సహాయాన్ని పొందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు, ఆర్‌పీజీ గ్రూప్‌ కూడా ప్రైడ్‌మంత్‌ సందర్భంగా తమ సంస్థలో ఉద్యోగుల కోసం ఎల్‌జీబీటీక్యూఏఐప్లస్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ బెనిఫిట్స్‌ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. అటు ఆర్‌–షీల్డ్‌ పేరిట ప్రత్యేక హెల్ట్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్‌ హర్ష్ గోయెంకా తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement