మెర్సిడెస్‌ బెంజ్‌ కలెక్టర్స్‌ ఎడిషన్ @ 4.3 కోట్లు.. ప్రత్యేకత ఇదే.. | Mercedes AMG G 63 Collector Edition for the Indian market | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్‌ బెంజ్‌ కలెక్టర్స్‌ ఎడిషన్ @ 4.3 కోట్లు.. ప్రత్యేకత ఇదే..

Jun 13 2025 2:53 PM | Updated on Jun 13 2025 3:07 PM

Mercedes AMG G 63 Collector Edition for the Indian market

లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ తాజాగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌’ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.3 కోట్లు (ఆల్‌ ఇండియా ఎక్స్‌–షోరూం). ప్రస్తుత టాప్‌ ఎండ్‌ లగ్జరీ వాహన కస్టమర్ల కోసం కంపెనీ కేవలం 30 యూనిట్లే విక్రయించనుంది. బెంగళూరులోని మెర్సిడెస్‌ బెంజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా (ఎంబీఆర్‌డీఐ) భాగస్వామ్యంతో భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ దీన్ని రూపొందించంది. తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలను కస్టమర్లు కోరుకుంటున్న నేపథ్యంలో టాప్‌ ఎండ్‌ లగ్జరీ సెగ్మెంట్లో హైపర్‌–పర్సనలైజేషన్‌ ట్రెండ్‌ ఎక్కువగా ఉంటోందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్‌’

  • మిడ్ గ్రీన్ మాగ్నో, రెడ్ మాగ్నో రంగుల్లో లభిస్తుంది.

  • మొదటగా కొనుగోలు చేసే కస్టమర్లకు డ్యాష్ బోర్డ్ గ్రాబ్ హ్యాండిల్‌పై తమ పేరును చెక్కించుకునే వీలుంది.

  • స్పేర్ వీల్ కవర్‌పై ‘వన్ ఆఫ్ థర్టీ’ ప్లేట్‌ ఉంటుంది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ను సూచిస్తుంది.

  • బ్లాక్ నాప్పా లెదర్, ఓపెన్ పోర్ వాల్నట్ వుడ్ ట్రిమ్‌తో ఇంటీరియర్‌ ఉంటుంది.
     

Advertisement
 
Advertisement
Advertisement