కొత్త కారు: సిట్రోయెన్‌ నుంచి ‘ఎయిర్‌క్రాస్‌ కంఫర్ట్‌’ ఎడిషన్‌ | Citroen Aircross Comfort Edition Launched, India price features limited edition | Sakshi
Sakshi News home page

కొత్త కారు: సిట్రోయెన్‌ నుంచి ‘ఎయిర్‌క్రాస్‌ కంఫర్ట్‌’ ఎడిషన్‌

Jun 28 2026 7:50 AM | Updated on Jun 28 2026 8:26 AM

Citroen Aircross Comfort Edition Launched, India price features limited edition

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ సంస్థ సిట్రోయెన్‌ ఇండియా, బ్రాండ్‌ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్‌యూవీ ‘ఎయిర్‌క్రాస్‌ కంఫర్ట్‌ ఎడిషన్‌’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ. 9.09 లక్షలుగా ఉంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ లోని అన్ని వేరియంట్లలో ప్రీమియం ‘మెట్రోపాలిటాన్‌ బీజ్‌ లెదరేట్‌ ఇంటీరియర్లను’ ప్రామాణికంగా చేర్చి కేబిన్‌ కంఫర్ట్‌ను మరింత పెంచారు.

వినియోగదారుల బడ్జెట్‌కు తగినట్లుగా ఇందులో యూ, ప్లస్, మ్యాక్స్‌ పేర్లతో మూడు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్‌లను పరిచయం చేశారు. వీటి ద్వారా 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్, వైర్‌లెస్‌ ఛార్జర్, ప్రీమియం జేబీఎల్‌ స్పీకర్లు జోడించారు.  భద్రత కోసం ఫ్రంట్‌ కొలిషన్‌ హెచ్చరికలు చేసే అడ్వాన్స్‌డ్‌ డాష్‌ క్యా మ్‌ను అదనంగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన మోడల్‌ బు కింగ్‌లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో, అధికారిక డిజిటల్‌ వేదికలలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement