మారుతీ కార్లు కొనేవారికి ఊరట.. | Maruti Suzuki Partners with Equitas Bank to Boost Retail Car Financing | Sakshi
Sakshi News home page

మారుతీ కార్లు కొనేవారికి ఊరట..

Jun 18 2025 7:28 PM | Updated on Jun 18 2025 8:31 PM

Maruti Suzuki Partners with Equitas Bank to Boost Retail Car Financing

ఆటోమొబైల్స్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు వాహన రుణాల సదుపాయాన్ని అందించేందుకు ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుతో చేతులు కలిపింది. కొత్త కార్లు, యూజ్డ్‌ కార్లు, వాణిజ్య వాహనాలకి రిటైల్‌ రుణాల కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ తెలిపింది.

మరింత పెద్ద సంఖ్యలో కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌ ఆఫర్లు అందించేందుకు ఇది తోడ్పడుతుందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్, సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు.

👉 ఇది చదివారా? టాటా కారు ఓనర్లకు గుడ్‌న్యూస్‌..    

మహీంద్రా చేతికి ఎస్‌ఎంఎల్‌ ఇసుజు 
వాణిజ్య వాహన తయారీ కంపెనీ ఎస్‌ఎంఎల్‌ ఇసుజులో మెజారిటీ వాటా సొంతం చేసుకునేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) అనుమతి పొందింది. ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. ఎస్‌ఎంఎల్‌ ఇసుజులో 58.96 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్‌లో ఎంఅండ్‌ఎం ప్రకటించింది.

ఇందుకు రూ. 555 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సంస్థలో సుమితోమో కార్పొరేషన్‌కున్న పూర్తి వాటా(43.96 శాతం)ను కొనుగోలు చేయనున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. అంతేకాకుండా పబ్లిక్‌ వాటాదారుగా ఉన్న ఇసుజు మోటార్స్‌ నుంచి 15 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement