ఓపెన్‌ ప్లాట్లకూ రుణాలు! | LOANS FOR PURCHASE OF OPEN PLOTS | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ ప్లాట్లకూ రుణాలు!

Jun 21 2025 3:10 PM | Updated on Jun 21 2025 5:00 PM

LOANS FOR PURCHASE OF OPEN PLOTS

సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు వంటి నిర్మాణ సంబంధమైన ప్రాపర్టీలకు బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు గృహ రుణాలు ఇస్తుంటాయి. ఓపెన్‌ ప్లాట్లు, స్థలాల కొనుగోళ్లకు రుణాల మంజూరు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. పలు థర్డ్‌ పార్టీ ఏజెన్సీలు ఓపెన్‌ ప్లాట్లకు సైతం రుణాలను మంజూరు చేపిస్తున్నాయి. 

ఓపెన్‌ ప్లాట్ల మార్కెట్‌ బాగుండి, మంచి అనుభవం ఉన్న డెవలపర్లకు ఫండింగ్‌ చేస్తుంటారు. ప్లాటింగ్‌ వెంచర్‌లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. స్థలం కొన్న తర్వాత రోడ్లు, లైటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి ఖర్చులకు మినహా పెద్దగా వ్యయం కాదు. అందుకే స్థలం కొనేందుకు కూడా లోన్లను ఇస్తుంటారు.

నాలుగు గోడలకు కాలం చెల్లింది.. 
బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నిధుల కొరతతో రియల్టీ ప్రాజెక్ట్‌లకు రుణాలు అంత ఈజీగా దొరకడం లేదు. కొత్త ప్రాజెక్ట్‌లకు లోన్స్‌ సంగతి దేవుడెరుగు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకూ ఫండింగ్‌ దొరకటం కష్టంగా మారింది. నాలుగు గోడల ఇంటికి కాలం చెల్లింది. కాంక్రీట్‌ భవనాలకు కొనుగోలుదారులు స్వస్తి పలికేశారు. సాంకేతికతను వినియోగించే టెకీ భవనాలు, ఆధునిక వసతులుండే విలాస గృహాలకు జై కొడుతున్నారు.

👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్‌! 

సౌర విద్యుత్, హోమ్‌ ఆటోమేషన్, ఎస్‌టీపీ, రెయిన్‌ హార్వెస్టింగ్‌ వంటి ఏర్పాట్లు ఉన్న గృహాల కొనుగోళ్లకే మద్దతు పలుకున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఈ తరహా ప్రాజెక్ట్‌ల పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నారు. అందుకే డెవలపర్లు కూడా ఇలాంటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలనే చేపట్టాలి. దీంతో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు వస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement