భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ | lenovo new ai server manufacturing venture in india | Sakshi
Sakshi News home page

భారత్‌లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ

Sep 19 2024 10:06 AM | Updated on Sep 19 2024 10:35 AM

lenovo new ai server manufacturing venture in india

బెంగళూరు: పర్సనల్‌ కంప్యూటర్ల తయారీలో ఉన్న బీజింగ్‌ కంపెనీ లెనోవో.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో ఏఐ సర్వర్ల తయారీ చేపట్టనుంది. వీటిని పుదుచ్చేరి ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు.

ఏటా 50,000 యూనిట్ల ఎంటర్‌ప్రైస్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వర్స్, 2,400 యూనిట్ల హై ఎండ్‌ గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ (జీపీయూ) తయారు చేయనున్నట్టు లెనోవో ఇండియా ఎండీ శేలేంద్ర కటియాల్‌ తెలిపారు. వీటిలో 60 శాతంపైగా సరుకును ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ఎగుమతి చేస్తారు.

అలాగే సంస్థకు నాల్గవ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భవిష్యత్తులో అన్ని ప్రధాన సర్వర్‌ డిజైన్, డెవలప్‌మెంట్స్, కొత్త సాంకేతిక కార్యక్రమాలను ఈ ల్యాబ్‌లో నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి సెంటర్స్‌ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 18 ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement