బంగారం కొనుగోళ్లు.. రూ.1.98 లక్షల కోట్లు! | Gold Prices Surge But Indian Love for Gold Remains Strong Says World Gold Council | Sakshi
Sakshi News home page

బంగారం కొనుగోళ్లు.. రూ.1.98 లక్షల కోట్లు!

Jul 30 2026 8:54 PM | Updated on Jul 30 2026 9:02 PM

Gold Prices Surge But Indian Love for Gold Remains Strong Says World Gold Council

భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే.. పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. కానీ.. ఈసారి పసిడి ధరలు భారీగా పెరగడంతో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం కొంత తగ్గినప్పటికీ.. బంగారంపై ప్రజలు ఖర్చు చేసిన మొత్తం మాత్రం రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 130.9 టన్నులుగా నమోదైంది. గత ఏడాది(139.1 టన్నులు)తో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తక్కువే, కానీ.. ధరలు మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది దాదాపు 59 శాతం పెరిగింది. దీనివల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది.

2026 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు బంగారం కొనుగోలు కోసం రూ.1.98 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు నివేదిక చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ. అంటే ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా ఖర్చు చేసిన మొత్తం పెరిగిందన్నమాట.

ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పద్ధతులు, ఈఎంఐ సౌకర్యాలు, తక్కువ బడ్జెట్‌లో విలువైన ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ అనేది ధరలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా రెండో అర్ధభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే ఆభరణాల కొనుగోళ్లపై కొంత ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.

ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్‌షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement