అందులో అమ్మారు.. ఇందులో కొన్నారు! | latest updates of PB Fintech and Delhivery major equity movements | Sakshi
Sakshi News home page

అందులో అమ్మారు.. ఇందులో కొన్నారు!

Jun 27 2025 8:51 AM | Updated on Jun 27 2025 8:51 AM

latest updates of PB Fintech and Delhivery major equity movements

పీబీ ఫిన్‌టెక్‌లో వాటా విక్రయం

డీల్‌ విలువ రూ. 920 కోట్లు 

ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా పీబీ ఫిన్‌టెక్‌లో కంపెనీ సహవ్యవస్థాపకులు యాషిష్‌ దహియా, అలోక్‌ బన్సల్‌ 1.09 శాతం వాటాను షేరుకి రూ. 1,821.5 సగటు ధరలో విక్రయించారు. ఇన్సూర్‌టెక్‌.. పాలసీబజార్, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ పైసాబజార్‌ మాతృ సంస్థలో 50.5 లక్షల షేర్లను అమ్మివేయడం ద్వారా రూ. 920 కోట్లు సమకూర్చుకున్నారు. ఎన్‌ఎస్‌ఈ బల్‌్కడీల్‌ వివరా ల ప్రకారం సీఈవో దహియా 0.74 శాతం వాటాకు సమానమైన 34 లక్షల షేర్లు. వైస్‌చైర్మన్‌ బన్సల్‌ 0.36 శాతం వాటాకు సమానమైన 16.5 లక్షల షేర్లు విక్రయించారు. తాజా లావాదేవీల తదుపరి పీబీ ఫిన్‌టెక్‌లో దహియా వాటా 4.31 శాతం నుంచి 3.57 శాతానికి, బన్సల్‌ వాటా 1.4 శాతం నుంచి 1.04 శాతానికి క్షీణించింది. కాగా.. ఈ వాటాలను దేశీ ఎంఎఫ్, బీమా రంగ సంస్థలతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో టాటా ఎంఎఫ్, ఎడిల్‌వీజ్‌ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్‌సహా సిటీగ్రూప్‌ గ్లోబల్, గోల్డ్‌మన్‌ శాక్స్, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు చేరాయి.

ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్‌ 10 బ్రాండ్లు


డెల్హివరీలో వాటా కొనుగోలు

జాబితాలో మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌

ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా లాజిస్టిక్స్‌ సర్వీసులందించే డెల్హివరీలో దేశ, విదేశీ దిగ్గజాలు వాటా కొనుగోలు చేశాయి. ఎన్‌ఎస్‌ఈ బల్క్‌డీల్‌ గణాంకాల ప్రకారం 1.6 శాతం వాటాకు సమానమైన 1.19 కోట్ల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నాయి. ఇందుకు షేరుకి రూ. 387 సగటు ధరలో రూ. 461 కోట్లు వెచి్చంచాయి. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ సింగపూర్, విరిడియన్‌ ఏఎంతోపాటు.. ఎంఎఫ్‌ సంస్థలు హెచ్‌డీఎఫ్‌ సీ, యాక్సిస్, టాటాతదితరాలు చేరాయి. అనుబంధ సంస్థలు నెక్సస్‌ అపార్చునిటీ ఫండ్, నెక్సస్‌ వెంచర్స్‌–3తో వీసీ కంపెనీ నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ తాజాగా డెల్హివరీలో వాటా విక్రయించింది. 2025 మార్చికల్లా డెల్హివరీలో 5.88 % వాటాను నెక్సస్‌ వెంచర్స్‌–3 కలిగి ఉంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement