వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిపాదన
ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలలో పారదర్శకతను పెంచే దిశగా వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్యాకేజ్డ్ కమోడిటీలకు సంబంధించి అవి ఏ దేశం నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు, వాటిని ఎంచుకునేందుకు వీలుగా సెర్చ్, సోర్టింగ్ ఫిల్టర్లలో ‘కంట్రీ ఆఫ్ ఆరిజిన్’ ఆప్షన్‌ను తప్పనిసరిగా పొందుపర్చాలని ప్రతిపాదించింది.
విస్తృతమైన జాబితా నుంచి తమకు కావాల్సిన ప్రోడక్టును సత్వరం కనుగొనడానికి యూజర్లకు, అలాగే ఆయా ప్రోడక్టుల పర్యవేక్షణలో అధికారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు నిర్దిష్ట చట్ట సవరణ చేసే దిశగా ముసాయిదా నిబంధనలను వినియోగదారుల వ్యవహారాల శాఖ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. నవంబర్ 22 వరకు దీనిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!


