రిటైల్‌ ధరల ఉపశమనం | Sakshi
Sakshi News home page

రిటైల్‌ ధరల ఉపశమనం

Published Tue, Nov 14 2023 6:10 AM

India retail inflation eases to four-month low of 4. 87percent in October - Sakshi

న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్‌లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్‌ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్‌లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 ప్లస్‌ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్‌ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్‌లలో ఆర్‌బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్‌బీఐ అంచనా.

Advertisement
Advertisement