సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ @ రూ.3.70 లక్షల కోట్లు | India Beauty Market Rs 3 7 Lakh Crore by 2030 Flipkart Report | Sakshi
Sakshi News home page

సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ @ రూ.3.70 లక్షల కోట్లు

Jun 21 2026 11:06 AM | Updated on Jun 21 2026 11:24 AM

India Beauty Market Rs 3 7 Lakh Crore by 2030 Flipkart Report

న్యూఢిల్లీ: దేశంలో సౌందర్య ఉత్పత్తుల వినియోగం విస్తృతమవుతోంది. ఈ మార్కెట్‌ ఏటేటా మరింత బలపడుతుండడంతో అంతర్జాతీయ కంపెనీలు సైతం భారత్‌కు ప్రయాణం కడుతున్నాయి. 2030 నాటికి 45 శాతం వృద్ధితో 39 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.70 లక్షల కోట్లు) ఈ మార్కెట్‌ చేరుకుంటుందని ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ నివేదిక అంచనా వేసింది.

సౌందర్య ఉత్పత్తుల విషయమై వినియోగదారుల వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు పేర్కొంది. గతంలో ప్రత్యేక సందర్భాల్లోనే సౌందర్య ఉత్పత్తులను వినియోగించే ధోరణి కాస్తా.. ఇప్పుడు సౌందర్య రక్షణకు నిత్యావసరంగా, ఆత్మ విశ్వాసం, గుర్తింపునకు చిహ్నంగా మారిపోయినట్టు తెలిపింది. ఈ మేరకు ‘ఫ్లిప్‌కార్ట్‌ గ్లామ్‌అప్‌ యాన్యువల్‌ బ్యూటీ ట్రెండ్స్‌ నివేదిక, 2026’ విడుదలైంది. ప్రస్తుతం భారత సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 27 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement