హైదరాబాద్‌లో జీతాలు ఎక్కువ.. జాబ్‌లు తక్కువ! | hyderabad job market high salaries low employment nso report | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో జీతాలు ఎక్కువ.. జాబ్‌లు తక్కువ!

Jul 3 2026 3:25 PM | Updated on Jul 3 2026 3:47 PM

hyderabad job market high salaries low employment nso report

సాక్షి, సిటీబ్యూరో: అన్నీ ఉన్నా నిరుద్యోగుల ముంగిట శని అన్నట్టుగా ఉంది హైదరాబాద్‌ నగర పరిస్థితి. ఓ వైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందించే సిటీ ఉపాధి కల్పనలో మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ వైరుధ్యాన్ని వెల్లడించాయి కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తొలి ‘నగర స్థాయి కారి్మక మార్కెట్‌ నివేదిక’ వెల్లడించింది.  

46 నగరాలతో పోలిస్తే.. 
దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న దేశంలోని 46 నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌ ఉద్యోగాల నాణ్యత, వేతనాలు, ఉత్పాదకతలో ముందంజలో ఉంది. ఆశించిన స్థాయిలో నిరుద్యోగ నిర్మూలన జరగలేదని యువత ఉపాధి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తేల్చింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం నిరుద్యోగ రేటు 6.8 శాతంగా నమోదైంది. ఇది మిలియన్‌ ప్లస్‌ నగరాల సగటు 4.9 శాతం కంటే ఎక్కువ. బెంగళూరు (2.8%), సూరత్‌ (1%), హౌరా (0.8%), రాజ్‌కోట్‌ (0.3%) వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నిరుద్యోగం చాలా అధికంగా ఉంది.    

ఉద్యోగ నాణ్యతలో మేటి.. 
ఉద్యోగాల నాణ్యత పరంగా హైదరాబాద్‌కు మంచి స్థానం దక్కింది. నగరంలోని ఉద్యోగుల్లో 62.1 శాతం మంది రెగ్యులర్‌ వేతన ఉద్యోగాల్లో ఉండగా, మిలియన్‌ ప్లస్‌ నగరాల సగటు 58.5 శాతంగా ఉంది. ఇది హైదరాబాద్‌లో స్థిరమైన ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెగ్యులర్‌ వేతన ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం రూ.31,153 కాగా, మిగిలిన నగరాల సగటు రూ.28,808 మాత్రమే. స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు నెలవారీ ఆదాయం రూ.30,075, రోజువారీ కూలీల సగటు వేతనం రూ.784గా నమోదైంది.

 

ఉపాధి.. ఏదీ..? 
లేబర్‌ ఫోర్స్‌ పారి్టసిపేషన్‌ రేట్‌ హైదరాబాద్‌లో 55.5 శాతంగా నమోదై, మిగతా నగరాల సగటు 52.4 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాల కోసం ప్రయతి్నంచేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అందరికీ ఉపాధి లభించడం లేదని నివేదిక పేర్కొంది. యువత పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు యువతలో 25.1 శాతం మంది ఉద్యోగంలో కానీ విద్యార్జనలో గానీ లేరు. ఇందులో యువతుల శాతం 37.3 ఉండగా, యువకుల శాతం 12.6 మాత్రమే ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement