ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్! | HDFC JM Launch New Mutual Fund Offers for Investors | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్!

Jun 29 2026 3:05 PM | Updated on Jun 29 2026 3:20 PM

HDFC JM Launch New Mutual Fund Offers for Investors

పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే ఇన్వెస్టర్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీ, జేఎం ఫైనాన్షియల్ కొత్త మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటో రంగంతో పాటు మల్టీ అసెట్ విభాగంలో పెట్టుబడులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌: దేశ ఎకానమీకి, తయారీ రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఎగుమతులకు ఆటోమొబైల్‌ పరిశ్రమ దన్నుగా ఉంటోంది. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడేలా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఫండ్‌ ప్రారంభించింది. ఇది జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ (టీఆర్‌ఐ)లోని దిగ్గజ ప్యాసింజర్‌ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ సంస్థల స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్‌ చేస్తుంది. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 15 స్టాక్స్‌ ఈ సూచీలో ఉంటాయి.

జేఎం మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్‌: ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తాజాగా మల్టీ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ జూలై 8న ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సాధనాలు, డెట్‌..మనీ మార్కెట్‌ సెక్యూరిటీలు, పసిడి–వెండి సంబంధ సాధనాలు, ఇతరత్రా ఎక్స్చేంజ్ ట్రేడెడ్‌ కమోడిటీ డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. తద్వారా ఒకే ఫండ్‌ ద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement