భారతదేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (జూన్ 26) గోల్డ్ రేటు ఊహకందని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు జరిగింది. ఈ కథనంలో తాజా ధరల వివరాలు చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడలలో శుక్రవారం ఉదయం రూ.250 పెరిగి రూ.1,29,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం రేటు.. సాయంత్రానికి రూ.1,30,850 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1050 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,600 నుంచి రూ.142750 వద్దకు చేరింది.
ఢిల్లీలో కూడా గోల్డ్ ధరలో మార్పులు కనిపించాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం నుంచి సాయంత్రానికి రూ.1,29,950 నుంచి రూ.1,31,050 వద్దకు (రూ.1100 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,750 రూపాయల నుంచి 1,42,950 రూపాయల వద్దకు చేరింది.
చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,33,000 (రూ.1600 పెరిగింది) వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,45,090 (రూ.1740 పెరిగింది) వద్ద నిలిచింది.


