బంగారం ధరల్లో ఊహకందని మార్పు! | Gold Rates Decline Across Hyderabad Delhi and Chennai | Sakshi
Sakshi News home page

బంగారం ధరల్లో ఊహకందని మార్పు!

Jun 20 2026 7:24 PM | Updated on Jun 20 2026 8:02 PM

Gold Rates Decline Across Hyderabad Delhi and Chennai

బంగారం ధరల భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా రూ.5670 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏడురోజుల్లో పసిడి ధరలలో జరిగిన మార్పులు, తాజా ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో జూన్ 14(ఆదివారం)న రూ.1,49,080 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు జూన్ 20(శనివారం) నాటికి రూ.1,46,080 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే కేవలం ఏడు రోజుల్లో రూ.3000 తగ్గినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల రేటు 1,36,650 రూపాయల నుంచి 1,33,900 రూపాయల (రూ.2750 తగ్గింది) వద్దకు చేరింది.

వారం ప్రారంభంలో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు.. ఆ తరువాత వరుసగా తగ్గడం మొదలైంది. వారాంతంలో ధరలు కొంత పెరిగాయి. దీంతో బంగారం ధరలలో ఊహకందని మార్పులు జరిగాయి.

ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలలో మార్పులు కనిపించాయి. దేశ రాజధాని నగరంలో గత ఆదివారం (జూన్ 14) రోజు 1,49,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం (జూన్ 20) నాటికి రూ.1,46,230 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 1,36,800 రూపాయల నుంచి 1,34,050 రూపాయల వద్దకు చేరింది.

చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ జూన్ 14న రూ.1,51,200 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర జూన్ 20 నాటికి 1,48,370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,38,600 రూపాయల నుంచి రూ.1,36,000 వద్దకు చేరింది.

ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement