తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే? | Today Gold And Silver Prices July 15th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Jul 15 2024 12:47 PM | Updated on Jul 15 2024 2:26 PM

Gold And Silver Price Today 15 July 2024

రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 15) పసిడి ధరలు గరిష్టంగా రూ. 110 తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73650 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73790 వద్ద ఉంది.

హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67850 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 74020 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర మునుపటికంటే రూ. 300 తగ్గింది. దీంతో కేజీ వెండి కొనుగోలు చేయాలంటే రూ. 95200 వెచ్చించాల్సి ఉంటుంది. మూడు రోజులు తర్వాత మళ్ళీ వెండి ధర తగ్గింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement