
గుజరాత్ ఐటీ /ఐటీఈఎస్ పాలసీ 2022-27 కోసం గుజరాత్ ప్రభుత్వం.. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ భాగస్వామ్యంతో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ మూడవ రోడ్‌షోను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. అసోచామ్ సహకారంతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. భారతదేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ప్రముఖ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షోలో గణేష్ హౌసింగ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్‌వర్క్‌కు పరిచయం చేయటంతో పాటుగా గుజరాత్ యొక్క పరివర్తనాత్మక కార్యక్రమాలు, విధానాలను ప్రదర్శించారు.
గుజరాత్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని.. గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మిలియన్ మైండ్స్ టెక్ సిటీ ఆవిష్కరణ ఈ రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ అన్మోల్ పటేల్ తన సంతోషం వ్యక్తం చేస్తూ .. భారతదేశంలో ప్రధాన ఐటీ హబ్‌గా వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది, అనేక ప్రముఖ టెక్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ వాటాదారులను కలుసుకోవటం, మా మిలియన్ మైండ్స్ టెక్ సిటీ విలువ ప్రతిపాదనను ప్రదర్శించడం ఒక వ్యూహాత్మక నిర్ణయం. హైదరాబాద్ రోడ్‌షోకు లభించిన అఖండ స్పందన మాకు నిజంగా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ మోనా ఖాంధర్, ఐఏఎస్ మాట్లాడుతూ.. గుజరాత్ ఐటి/ఐటీఈఎస్ పాలసీ 2022-27 అత్యున్నత శ్రేణి తయారీ, ఆర్&డి, డిజిటల్ పరివర్తనను సజావుగా అనుసంధానించే శక్తివంతమైన.. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే మా లక్ష్యం ప్రతిబింబిస్తుంది. ధోలేరాలోని సెమీకండక్టర్ హబ్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు , నైపుణ్యం, పరిశోధనలపై అధికంగా దృష్టి సారించటం వంటి మార్గదర్శక కార్యక్రమాలతో , పోటీతత్వ ప్రపంచ దృశ్యంలో అభివృద్ధి చెందడానికి మేము పరిశ్రమలు మరియు స్టార్టప్‌లను శక్తివంతం చేస్తున్నామని అన్నారు.