కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! | Gold Price Rally Just Beginning, Says Robert Kiyosaki, Forecasts Massive Surge By 2035 | Sakshi
Sakshi News home page

కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!

Jun 15 2026 9:20 PM | Updated on Jun 16 2026 1:58 PM

Finally Gold Began Its Move Robert Kiyosaki Tweet

బంగారం ధరలు పెరుగుతాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' మరోసారి హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మొత్తానికి బంగారం తన కదలికను ప్రారంభించింది. ఒక్క రోజులోనే 100 డాలర్లు దాటింది. మీరు దీనిని గమనించారా?. ఒకవేళా గమనించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసిడి ధర పెరుగుదల ఇప్పుడే మొదలైంది. ఈ రోజు బంగారం ఔన్సుకు 4300 డాలర్ల వద్ద ఉంది. అయితే 2035 నాటికి ఇది 35,000 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి పేర్కొన్నారు.

కియోసాకి అభిప్రాయం ప్రకారం డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుంది. అందుకే "క్యాష్ ఈజ్ ట్రాష్'' అని వ్యాఖ్యానిస్తూ, కేవలం డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు రూపంలో డబ్బును నిల్వ ఉంచడం కంటే.. విలువను నిలబెట్టుకునే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటున్నారు.

బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం, చమురు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం మంచిదని కియోసాకి సలహా ఇస్తున్నారు. తాను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగదును ఈ ఆస్తులుగా మార్చుకుంటూ వచ్చానని, వాటినే 'నిజమైన డబ్బు'గా భావిస్తున్నానని చెప్పారు.

అయితే ఇది కియోసాకి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పెట్టుబడుల విషయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రిస్క్‌లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ విషయంలో పెట్టుబడిదారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement