ఐఫోన్ 17 కోసం తన్నుకున్న కస్టమర్లు (వీడియో) | Fight At Mumbai Apple Store As iPhone 17 Goes On Sale | Sakshi
Sakshi News home page

ముంబై: ఐఫోన్ 17 కోసం తన్నుకున్న కస్టమర్లు(వీడియో)

Sep 19 2025 11:27 AM | Updated on Sep 19 2025 12:41 PM

Fight At Mumbai Apple Store As iPhone 17 Goes On Sale

యాపిల్ ఐఫోన్ 17 సేల్స్ ఈ రోజు (సెప్టెంబర్ 19) నుంచి మొదలయ్యాయి. ఉదయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని యాపిల్ స్టోర్‌లో కొత్త ఐఫోన్ 17 వేరియంట్‌లను కొనుగోలు చేయడానికి ఔత్సాహికులు బారులు తీరారు. ఈ సమయంలో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. గుమికూడిన జనంలో యువకులు కొట్టుకోవడం కనిపిస్తుంది. వారిని వారించడానికి పోలీసులు రావడం కూడా కనిపిస్తుంది. ఓ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అతనిపై సెక్యూరిటీ చేయిచేసుకోగా.. అవతలి వ్యక్తికూడా సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసాడు. సరైన భద్రత లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.

ఐఫోన్ 17 ధరలు

ఐఫోన్ 17

➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900
➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900

ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్

➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900
➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900
➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900
➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900
➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900
➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900
➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900

ఐఫోన్ 17 ఎయిర్ 

➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900
➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900
➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement