EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్‌! | EPFO Portal To Remain Unavailable From June 26 28 | Sakshi
Sakshi News home page

EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్‌!

Jun 25 2026 6:53 PM | Updated on Jun 25 2026 7:05 PM

EPFO Portal To Remain Unavailable From June 26 28

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. సిస్టమ్‌ను మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చేందుకు జూన్ 26 నుంచి జూన్ 28 (మూడు రోజులు) వరకు పోర్టల్‌లో చాలా సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.

ఈ సమయంలో కొత్త ఈపీఎఫ్ క్లెయిమ్‌ చేయడం, క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అంటే.. ఈ మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలని లేదా ట్రాన్స్‌ఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నవారు కాస్త వేచి ఉండాల్సిందే.

సేవలు నిలిచే సమయం

  • జూన్ 26, 2026: రాత్రి 12 గంటల నుంచి

  • జూన్ 28, 2026: రాత్రి 11:59 వరకు

  • జూన్ 29 నుంచి సేవలు మళ్లీ ప్రారంభం

ఈ సమయంలో కొత్త క్లెయిమ్‌లు చేయలేరు. అంతేకాదు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా ఆగిపోతుంది. అయితే క్లెయిమ్‌లు రద్దు కావని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అవి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం మాత్రమే ఉంది. అవసరమైతే సహాయం కోసం EPFO హెల్ప్‌లైన్ నంబర్ 14470 అందుబాటులో ఉంటుంది. ఈ తాత్కాలిక అంతరాయం వల్ల ఇబ్బంది కలిగినా, భవిష్యత్తులో సేవలు మరింత వేగంగా అందించడానికే ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నామని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement