తాత చనిపోయారంటే.. అందుబాటులో ఉంటావా? అన్న మేనేజర్ | Employee Seeks Leave For Grandfather Death and Manager Reply | Sakshi
Sakshi News home page

తాత చనిపోయారు.. సెలవు కావాలన్న ఉద్యోగి: మేనేజర్ రిప్లైపై నెటిజన్లు ఫైర్

Nov 16 2025 7:24 PM | Updated on Nov 16 2025 7:55 PM

Employee Seeks Leave For Grandfather Death and Manager Reply

తాత మరణించారని, సెలవు కావాలని అడిగిన ఉద్యోగికి.. మేనేజర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మేనేజర్ ఇచ్చిన సమాధానం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

నా తాత ఉదయం చనిపోయారు, నాకు సెలవు కావాలని ఉద్యోగి వాట్సాప్ ద్వారా అడిగారు. దీనికి మేనేజర్ సమాధానం ఇస్తూ.. నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. నువ్వు సెలవు తీసుకో.. కానీ వాట్సాప్‌లో అందుబాటులో ఉంటావా?, అవసరమైనప్పుడల్లా డిజైనర్లకు అందుబాటులో ఉంటావా? అని రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ సందేశాల స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ.. నేను గత రెండు సంవత్సరాలుగా ఈ తెలివితక్కువ ఏజెన్సీలో పనిచేస్తున్నాను. వారు నా పాత్రలను మార్చారు, నాకు పరిధికి మించి పనిని అప్పగించారు. ఎంతోమంది ఉద్యోగులను తొలగించారు. నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయలేదు. నేను నా పనిని & నా బృందాన్ని నిజంగా ఆస్వాదించాను. ఇప్పుడు ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. నా పనిని చూసుకోవడానికి మీకు మరెవరూ లేకపోవడం నా సమస్య ఎందుకు అవుతుంది? మనం మనుషులం, ఫలితాలను వెలువరించే యంత్రాలు కాదని నిర్వాహకులు మర్చిపోతారా? అని ఉద్యోగి రెడ్దిట్ పోస్టులో రాశాడు.

ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మేనేజర్ ఇచ్చిన సమాధానాన్ని ఖండించారు. ఉద్యోగి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తాత చనిపోయాడంటే కూడా వాట్సాప్‌లో అందుబాటులో ఉంటావా? అని అడగడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఉద్యోగాన్ని వదిలేయండి అని కొందరు సలహా ఇచ్చారు.

బ్రదర్, మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధగా ఉంది. ఈ సమయంలో, నిజాయితీగా చెప్పాలంటే, వేరే ఉద్యోగం కోసం వెతుక్కోండి అంటూ మరొకరు సలహా ఇచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో మీ కంపెనీ పేరు, మేనేజర్ పేర్లను వెల్లడించండి అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మూడేళ్ల పాత ఫోన్.. ఐ20 కారులోనే ప్రయాణం!: ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement